ఇవాళ విద్యాసంస్థలు బంద్

school-holidayఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఇవాళ(గురువారం,జూన్-5) డీఎడ్ కాలేజీలు, ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ నిర్వహిస్తున్నాయి .B.Ed చేసిన వాళ్లు కూడా  SGT పోస్టులకు అర్హులేనని….2010 నాటి గెజిట్ కు సవరణ చేస్తూ  జూన్ 29న  కొత్త గెజిట్ రిలీజ్ చేసింది NCTE.  దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎడ్  అభ్యర్థులు ..సుప్రీంకోర్టు ఆదేశాలు గతం లాగే అమలు చేయాలని SGT  పోస్టులను 100% డీఎడ్  వారికే అవకాశం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు పాటించాలని డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా గురువారం తెలుగు రాష్ట్రాల్లో డి.ఎడ్ కాలేజీలు, ప్రైవేట్ విద్యా సంస్థలు మూసివేసి బంద్ ను విజయవంతం చేయాలని డీఎడ్ అబ్యర్థుల సంఘం పిలుపునిచ్చింది. NCTE అక్రమ గేజిట్ ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. దీనిపై త్వరలోనే సుప్రీంకోర్టు లో పిటిషన్ వేయనున్నట్లు తెలిపింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy