నేడు TS పాలిసెట్ ఎగ్జామ్

TS POLICETTS పాలిసెట్‌ పరీక్ష నేడు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి చైర్మన్ నవీన్‌మిట్టల్ చెప్పారు. 359 కేంద్రాల్లో శనివారం (ఏప్రిల్-21) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్ రాయనున్న 1 లక్షా 25వేల 063 మంది అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రానికి గంటముందే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఆయన స్పష్టంచేశారు. అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వెంట తీసుకురావద్దని, హెచ్‌బీ/2బీ పెన్సిల్, షార్ప్‌నర్, ఎరాజర్, హాల్ టిక్కెట్ మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy