ఇవుంటేనే ఇంజినీరింగ్ కాలేజీలు.. లేకుంటే అంతే

Engineeringఇంజనీరింగ్‌ విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలు, కాలేజీల గుర్తింపునకు సంబంధించి ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) నూతన మార్గదర్శకాలను ఖరారు చేసింది. శనివారం ఈ మేరకు అప్రూవల్‌ ప్రాసెస్‌ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచింది. కొత్తగా జారీ చేసిన నిబంధనలు 2018–19 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి డీమ్డ్‌ యూనివర్సిటీ, ప్రైవేటు యూనివర్సిటీలకు ఏఐసీటీఈ గుర్తింపు తప్పనిసరి. కొత్తగా విద్యా సంస్థ అనుమతికి సంబంధించిన ప్రాసెసింగ్‌ ఫీజును అదనంగా రూ.లక్ష పెంచింది.

కొత్త నిబంధనలు:

.. పట్టణ ప్రాంతాల్లో  ఇంజినీరింగ్ భవనాలు 1.5 ఎకరాల్లో ఉండాలి. అదే గ్రామీణ ప్రాంతాల్లో 7.5 ఎకరాల నుంచి 4 ఎకరాలు

.. యూజీసీ స్థాయిలో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు

.. పీజీ స్థాయిలో ఫార్మసీలో 1:10 నుంచి 1:5గా ఫ్యాకల్టీ

.. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 1:15 నుంచి 1:20

.. డిప్లొమాలోని అన్ని కోర్సుల్లో 1:25

.. ప్రతి ఇంజనీరింగ్‌ కాలేజీలో కనీసం 48 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో కూడిన ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని సూచించింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy