ఇష్టం లేకున్నా.. తప్పక పంపుతున్నా

modi-naiduఅధికార NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా… కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ(జూలై 18) నామినేషన్ వేయనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సోమవారం(జూలై 17) జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో… వెంకయ్యను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించారు. ఆ తర్వాత NDA పక్ష పార్టీలతో మాట్లాడారు మోడీ. ఎంతో అనుభవమున్న వెంకయ్యను పార్టీకి, ప్రభుత్వానికి దూరం చేసుకోవటం ఇష్టం లేకున్నా.. తప్పలేదన్నారు మోడీ.

ఉపరాష్ట్రతి ఎన్నికలలో వెంకయ్యనాయుడు-గోపాలకృష్ణ గాంధీ మధ్య పోటీ ఖాయమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నరు వెంకయ్యనాయుడు. నామినేషన్ దాఖలు చేయనుండటంతో.. రాత్రి పార్టీతో పాటుగా.. కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార-ప్రసార శాఖల మంత్రి పదవులకు రాజీనామా చేశారు వెంకయ్య.

నిన్న రాష్ట్రపతి ఎన్నికలు అయిపోయిన తర్వాత.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీ ఆధ్వర్యంలో పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్న వెంకయ్యను… ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఖరారు చేసింది. దేశంలో సీనియర్ నేతలలో వెంకయ్య ఒకరన్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. ఆయన ఉపరాష్ట్రతి పదవికి అన్ని విధాలుగా అర్హుడని చెప్పారు. వెంకయ్యను అభ్యర్థిగా నిర్ణయించగానే… NDA పార్టీల నాయకులతో మాట్లాడారు ప్రధాని మోడీ, అమిత్ షా.  సీఎం కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడిన మోడీ ఆయన మద్దతు అడిగారు. వెంకయ్య ఎంపికపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను కూడా ఫోన్లో మద్దతు కోరారు మోడీ.

వెంకయ్యను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంపై రెండుమూడు రోజుల కిందే పని మొదలుపెట్టారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ ముందే ఎంపీలతో సంతకాలు తీసుకున్నారు. అయితే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునేందుకు వెంకయ్యకు ఇష్టం లేకపోయినా… మోడీ, అమిత్ షా ఆయనను ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక వెంకయ్యను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికచేయటంపై పార్టీకి తీరని నష్టమన్న మోడీ.. విస్తృత ప్రయోజనాలతోనే వదులుకోవాల్సి వస్తుందని.. సమావేశంలో అన్నట్లు సమాచారం.

ఇక వెంకయ్యను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించడానికి ఇంకో కారణం చెబుతున్నారు బీజేపీ నేతలు. రాజ్యసభ ఛైర్మన్ గానూ పనిచేసే ఉపరాష్ట్రపతి పదవిలో వెంకయ్య ఉండడం అనుకూలమని భావిస్తున్నారు. బీజేపీకి రాజ్యసభలో తగినంత బలం లేదు. 19 ఏళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్య ఆ అనుభవంతో సభను సమర్థవంతంగా నడిపిస్తారనే ఆయన్ను ఎంపిక చేశామంటున్నారు. వెంకయ్య ఉపరాష్ట్రపతి అయితే ఆ పదవికి ఎన్నికైన మొదటి తెలుగు నాయకుడు అవుతారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy