ఇష్టం లేని పెళ్లంట : కాళ్ల పారాణి ఆరకముందే.. భర్తను చంపించింది

newly-marriedఏపీ రాష్ట్రం విజయనగరం జిల్లా పార్వతీపురంలో నవ దంపతులపై దాడి.. భర్త హత్య కేసులో ట్విస్ట్. దోపిడీదొంగలు దాడి చేసి భర్తను చంపి.. బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని చెప్పిన భార్య మాటలపై అనుమానంతో.. విచారణ చేసిన పోలీసులకు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ప్రపంచం నివ్వెరపోయే విధంగా ఉన్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన యామక శంకరరావుకు.. సరస్వతితో వివాహం అయ్యింది. పెళ్లయ్యి నాలుగు రోజులు మాత్రమే. సరస్వతికి సొంత మేనమామ కుమారుడే భర్త శంకరరావు. సరస్వతి పీహెచ్ డీ చేసింది. చదువుకు కావాల్సిన ఆర్థిక సాయంతోపాటు మంచిచెడులు కూడా భర్త అయిన బావ శంకరరావే దగ్గరుండి చూసుకున్నాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించాయి రెండు కుటుంబాలు. అనుకున్నట్లే నాలుగు రోజుల క్రితం ఘనంగా పెళ్లి చేశారు. ఇక్కడే కథ అడ్డం తిగిరింది.

చదువుకునే రోజుల్లో సరస్వతి.. శివ అనే యువకుడి ప్రేమలో పడింది. అయితే పెద్దలను ఎదిరించలేక బావ శంకరరావుతో పెళ్లికి ఒప్పుకుంది. అయితే భర్తను అడ్డుతప్పించుకోవాలని నిర్ణయించింది. భారీ స్కెచ్ వేసింది. ప్రియుడు శివతో కలిసి.. వైజాగ్ కు చెందిన గోపీ అనే రౌడీ గ్యాంగ్ తో భర్త హత్యకు ఒప్పందం చేసుకుంది. వారికి డబ్బుల కింద భర్త ఇచ్చిన ఎంగేజ్ మెంట్ రింగ్ ఇచ్చింది. పెళ్లయిన తర్వాత నాలుగో రోజు.. సోమవారం రాత్రి భర్తతో కలిసి బయటకు వచ్చిన సరస్వతి ఈ విషయాన్ని రౌడీగ్యాంగ్ గోపీకి తెలియజేసింది. వెంటనే వారు వెంబడించారు. పార్వతీపురం నుంచి రాత్రి 8.30గంటలకు చిట్టివలస బయలుదేరారు. మధ్య వారిని ఆటోలో అడ్డగించిన వీరు.. అనుకున్నట్లుగానే శంకరరావును హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా దోపిడీ దొంగలు అనుకోవాలనే ఉద్దేశంతో సరస్వతి ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా దోచుకుని వెళ్లారు.

చిట్టివలస నుంచి వెళుతున్న గోపీ గ్యాంగ్.. మానాపురం దగ్గర తనిఖీల్లో ఎస్పీ పాలరాజు వాహనం పక్కనే ఆగారు. అనుమానం వచ్చిన ఎస్పీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చిట్టివలసలో నవదంపతులపై దాడి విషయం తెలియటం.. ఇక ఆస్పత్రిలో భార్య సరస్వతి ప్రవర్తన కూడా అనుమానాలు.. దోపిడీపై భార్య చెబుతున్న మాటలు పొంతన లేకుండా ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోలీసులు తమదైన స్టయిల్ లో విచారణ చేయటంతో కేసులోని ట్విస్ట్ వీడింది. కేసులో ప్రమేయం ఉన్న అందరూ కూడా ఉన్నత చదువులు చదువుకున్న వారే కావటం ఇక్కడ మరో విశేషం…

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy