ఇష్టపడి తీసిన సినిమా ‘వైశాఖం’ : డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ

director-fb‘చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌లీ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వైశాఖం’ రూపొందించారు. అపార్ట్‌మెంట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో క్యూట్‌ లవ్‌స్టోరీతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ని కూడా సమపాళ్ళలో ఎలివేట్‌ చేస్తూ రూపొందిన ఈ చిత్రం ఇది. జూలై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది  ‘వైశాఖం’. ఈ సందర్భంగా డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి.తో జరిపిన ఇంటర్వ్యూ.

‘వైశాఖం’ జర్నీ ఎలా వుంది? 

ఇది చాలా టఫ్‌ జర్నీ అనే చెప్పాలి. చాలా అప్‌ అండ్‌ డౌన్స్‌ చూశాను. నేను అనుకున్నది అనుకున్నట్టు రావాలంటే చాలా విషయాలు కలవాలి. అలా జరగడం కోసం చాలా కష్టపడ్డాను. ఉదాహరణకి కజక్‌స్తాన్‌ టూరిస్ట్‌గా వెళ్ళడమే కష్టం. అలాంటిది 23 మంది యూనిట్‌తో 400 కేజీల లగేజ్‌తో 15 రోజులు ట్రావెల్‌ చేసి సాంగ్స్‌ తీశాం అక్కడ. కేవలం ప్రాసెస్‌ అయి పాస్‌పోర్టులు రావడానికే మూడు నెలలు పైన పట్టింది. అక్కడ షూట్‌ చెయ్యడం చాలా కష్టం. మూడు రోజులకోసారి పాస్‌పోర్ట్‌ స్టాంపింగ్‌ చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే మూడునెలలు జైలు తప్పదు.

హీరో, హీరోయిన్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఎలా వుంటుంది? 

– సినిమాలో నటించిన ఆర్టిస్టులంతా ఎంతో బాగా చేశారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్లు. చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. ఇండస్ట్రీకి చాలా హెల్ప్‌ అవుతారు. మా హీరో నిర్మాతల హీరో. మంచి బిహేవియర్‌ వున్న వ్యక్తి. చాలా బాగా చేశాడు. కొత్త హీరో, హీరోయిన్‌లను చూస్తున్నామన్న ఫీలింగ్‌ మీకు ఎక్కడా రాదు. సాయికుమార్‌గారు చాలా ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ చేశారు. ఆయన క్యారెక్టరే కథని మలుపు తిప్పుతుంది. ఒక సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌ ఒక స్టేజ్‌లో మర్చిపోతారు. జీవితాన్ని, రియల్‌ లైఫ్‌ని ఫాలో అవుతున్నాం అనుకుంటారు.

మీ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్‌ ఎక్కువైంది? 

– ఇది వాస్తవం. ఈసారి బడ్జెట్‌ ఎక్కువైంది. ఎందుకంటే ఇది ఛాలెంజింగ్‌గా తీసుకున్న సినిమా. ప్రేక్షకులు, ఇండస్ట్రీ ‘వైశాఖం’ చాలా బాగుంది, చాలా గ్రాండ్‌గా వుంది అని చెప్పుకోవాలి అనే ఇంటెన్షన్‌తో తీసిన సినిమా. ఈ సినిమాల్లో అన్నీ హిట్‌ సాంగ్సే వుంటాయి. ముఖ్యంగా రామజోగయ్యశాస్త్రిగారు రాసిన లాస్ట్‌ సాంగ్‌ ‘కంట్రీ చిలకా..’. ఓ వారం పదిరోజులు ఆ పాట విన్నాను. ఈ పాట మన సినిమాలో పెట్టుకోవాలా? వద్దా? అనే కన్‌ఫ్యూజన్‌ వచ్చింది. ఎందుకంటే మహేష్‌, ఎన్టీఆర్‌ మీద తియ్యాల్సిన పాట అది. అంత గ్రాండియర్‌, అంత ఫాస్ట్‌ వుండే ఆ పాటని మన హీరో, హీరోయిన్‌ చెయ్యగలరా? అనుకుని కూడా మనం చెయ్యాలి, మన సినిమాలో ఆ పాట వుంటే బాగుంటుంది, ఒక విజువల్‌ ట్రీట్‌గా ఆడియన్స్‌కి ఇవ్వాలి, మనం కూడా అలాంటి సాంగ్‌ తియ్యగలం అని చూపించాలి అని ఒక ఛాలెంజ్‌తో చేసిన పాట. ఈ పాటను శేఖర్‌ మాస్టర్‌ చేశారు. పాట విని ఆయన షాక్‌ అయ్యారు.

అపార్ట్‌మెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో కథ చెప్పడానికి రీజన్‌ ఏదైనా వుందా? 

– ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. అన్నీ మినీ ఫ్యామిలీసే. పల్లెటూళ్ళో కూడా అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ వచ్చింది. ఇండివిడ్యువల్‌ ఇళ్ళు మెయిన్‌టెయిన్‌ చేసే కెపాసిటీ తగ్గింది. అందరూ అపార్ట్‌మెంట్స్‌నే ప్రిఫర్‌ చేస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్స్‌లో రకరకాల మనుషులు వుంటారు. వాళ్ళ మధ్య వచ్చే క్లాషెస్‌, వాళ్ళ మధ్య వుండే రిలేషన్స్‌షిప్స్‌ అనేవి ఎలా వుంటాయి అనేది ఒక రియాలిటీ. అంటే ఒక యదార్థ గాధని ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నాను.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy