ఇస్రో బాహుబలి 2 : గయానా నుంచి జీశాట్ 17 ప్రయోగం

gsat_17 isroఇస్రో మరో ప్రయోగానికి రెడీ అవుతోంది. GSAT-17 సమాచార ఉపగ్రహాన్ని గురువారం ప్రయోగించనుంది. అయితే  ప్రయోగం ఫ్రెంచ్ లోని గయానాలో ఎరియాన్ -5 లాంచ్ వెహికిల్ ద్వారా జరగనుంది. నెలలోపులో ఇస్రో నుంచి జరగుతున్న మూడో ప్రయోగం ఇది. జూన్ 5న జీశాట్ 19, జూన్ 23న పీఎస్ఎల్వీ-సీ38 ప్రయోగించగా… గురువారం ఎరియానా స్పేస్ నుంచి మరో ప్రయోగం జరగనుంది. ఎరియానా స్పేస్ నుంచి ఇప్పటి వరకు 21 ప్రయోగాలు జరిపింది ఇస్రో. జీశాట్ – 17 ఉపగ్రహ బరువు 3,447 కేజీలు. ఇంత బరువైన ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించటం రెండోసారి. జీశాట్ 17 వాతావరణ అంశాలు, సెర్చ్ అండ్ రెస్క్యూ సేవలు దీని ద్వారా పొందనున్నారు. 15 ఏళ్లపాటు అంతరిక్షంలో సేవలు అందించనుంది. ఈ ఉపగ్రహం ద్వారా.. వాతావరణానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం లభిస్తోంది. వాతావరణంలో మార్పులు, వర్షాలు, ఎండలు, గ్లోబల్ వార్మింగ్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy