ఇస్రో మరో ప్రయోగం: చంద్రాయన్-2కు సన్నాహాలు

isro
PSLV-C40 ప్రయోగం సక్సెస్‌ నింపిన ఉత్సా హంతో మరో భారీ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్ధమవుతున్నది. తర్వాత ప్రయోగంలో భాగంగా చంద్రయాన్‌ -2ను నింగిలోకి పంపించేందుకు కసరత్తు చేస్తోంది. బెంగళూరులోని ఉపగ్రహ కేంద్రం, ఇతర కేంద్రాల్లో చంద్రయాన్-2 వ్యోమనౌన,ల్యాడర్,రోవర్ ప్రధాన,ఉప వ్యవస్థల అనుసంధానాలు పూర్తయి పరీక్షిస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. చంద్రయాన్-1 లా కాకుండా వ్యోమనౌక నెమ్మదిగా దిగేందుకు అన్ని రకాల చర్య లు చేపట్టినట్లు తెలిపారు. ఆశయ సాధనకు వ్యోమనౌక సమర్ధతను తమిళనాడు మహేంద్రగిరి ఇస్రో ఇందన కేంద్రంలో పరీక్షిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం వ్యోమనౌకను 100 మీటర్ల ఎత్తునుంచి కిందకు జార విడుస్తారు. వ్యోమనౌక కక్ష్య నుంచి చంద్రునిపై కుప్పకూల కుండా నెమ్మదిగా వాలేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందన్నారు సైంటిస్టులు. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం 100 మీటర్ల ఎత్తులో చంద్రమండలంలోని గురుత్వాకర్షణ వాతావరణాన్ని సృష్టిస్తారు. 500 కిలో గ్రాముల బరువైన వ్యోమనౌకను మండించడం ద్వారా కిందకు  నిలువుగా, అడ్డంగా జారవిడుస్తారు. నౌక దిగాల్సిన దగ్గర రాళ్లు,బండలు ఉంటే మరో సురక్షిత స్థానాన్ని గుర్తించి అక్కడ దిగేందుకు ఇలాంటి విన్యాసాలు సాయపడుతాయని తెలిపారు. 30 మీటర్ల  ఎత్తునుంచి జారవిడిచే తొలి దశ పరీక్ష విజయవంతంగా ముగిసింది. చంద్రయాన్-2 ను ప్రయోగించదలిచిన గడువు మార్చి సమీపిస్తుండటంతో అన్ని చర్యలను స్పీడప్ చేస్తున్నట్లు  తెలిపారు. దీని లోని ఆర్బిటర్, లాండర్, రోవర్…చంద్రునిలేని ఖనిజ వనరులు, మూలకాల్ని అన్వేషిస్తుంది.GSLV మార్క్-2 తో చంద్రయాన్-2ను ప్రయోగిస్తారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy