ఇస్రో మాజీ చైర్మన్ కన్నుమూత

ISRO EX.CHIEFప్రఖ్యాత శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చీఫ్ ప్రొఫెసర్‌ ఉడిపి రామచంద్రరావు(85) సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణంతో భారత అంతరిక్ష సంస్ధ(ఇస్రో) షాక్‌కు గురయ్యింది. గత ఏడాదిగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారు జామున 2.30 గంటలకు తుది శ్వాస విడిచారు. 1984-1994 మధ్య ఇస్రోకు ఆయన చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాల్లో బోధకుడిగా పనిచేశారు ఆయన. యూఆర్‌.రావు శాస్త్రవేత్తగా పది అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం ఫిజికల్‌ రీసెర్చ్‌ లాబోరేటరీ పరిపాలనా విభాగ చైర్మన్‌గానూ, తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకు చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్నారు.

సతీష్‌ ధావన్ తర్వాత పదేళ్ల పాటు ఇస్రోకు చైర్మన్‌గా వ్యవహరించి ఆ సంస్థ అభివృద్ధికి ఎనలేని సేవ చేశారు. మామ్‌ మిషన్‌ కోసం ఇస్రోతో కలసి ఆయన పనిచేశారని సీనియర్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఆయన లేరనే మాట ఊహించడానికి కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు పలువురు శాస్త్రవేత్తలు. దేశానికి రావు అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఆయనకు పద్మవిభూషణ్‌ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును రాష్ట్రపతి చేతులు మీదుగా అందుకున్న ఆయన ‘నా మరణానంతరం అవార్డు వస్తుందని అనుకున్నా’ అని వ్యాఖ్యానించారు పలువురు మిత్రులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy