ఇస్రో యు టర్న్: జీశాట్-11 శాటిలైట్‌ వెనక్కి

gsatఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) వెనక్కి తగ్గింది. ప్రయోగానికి సిద్ధమైన జీశాట్-11 ఉపగ్రహాన్ని వెనక్కి రప్పించింది. ఈ ఉపగ్రహాన్ని దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానాలో ఉన్న కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించాల్సి ఉంది. మే 25వ తేదీన జరగాల్సిన ప్రయోగాన్ని రద్దు చేస్తున్నట్లు ఏరియన్ సంస్థ తెలిపింది. ఏరియన్ 5 రాకెట్ ద్వారా జీశాట్-11ను ప్రయోగించాలనుకున్నారు. దాని కోసం మార్చి 28వ తేదీనే జీశాట్ ఉపగ్రహాం కౌరుకు చేరుకున్నది. కానీ ఇస్రో అకస్మాత్తుగా ప్రయోగాన్ని నిలిపివేసింది. జీశాట్-11కు అదనపు టెక్నాలజీ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని ఇస్రో తెలిపింది. జీశాట్-11 మొత్తం 5870 కిలోల బరువు ఉంది. 12GBPS కెపాసిటీకి తగ్గట్లుగా దీన్ని డిజైన్ చేశారు. ఇస్రో ఎందుకు జీశాట్ ప్రయోగాన్ని నిలిపేసిందన్న దానిపై స్పష్టత లేదని తెలిపింది ఏరియన్ సంస్థ. కానీ ఇస్రోకు సహకరిస్తామని ఆ సంస్థ తెలిపింది. అయితే మార్చి 29న ప్రయోగంచిన జీశాట్-6 ఆచూకీ ఇంకా చిక్కలేదు. ఆ టెలికాం శాటిలైట్ గగనతలంలో మిస్సైన విషయం తెలిసిందే. జీశాట్-11 ద్వారా కా, కూ బ్యాండ్‌లలో స్పాట్ బీమ్ కవరేజ్ ఇవ్వనున్నారు. భారత్‌తో పాటు సమీప దీవులకు ఈ సేవలు అందనున్నాయి. జీశాట్11 ప్రయోగం కోసం భారత్ సుమారు 1117 కోట్లు ఖర్చు చేసింది. మార్చి 2016లో కేంద్ర క్యాబినెట్ ఈ ప్రయోగానికి గ్రీన్ సిగ్నలించ్చింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy