ఇస్రో శాస్త్రవేత్తలకు దేశం సెల్యూట్‌ : మోడీ

narendra-modiపీఎస్‌ఎల్‌వీ-సీ37 ప్రయోగం సక్సెసవడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి ప్రపంచ రికార్డు సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసించారు ఆయన. పీఎస్‌ఎల్‌వీ-సీ 37 ద్వారా కార్టోశాట్‌-2తో పాటు మరో 103 ఉపగ్రహాలు కక్ష్యలో చేరడంతో ట్విట్టర్‌ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు మోడీ. ఈ ప్రయోగం దేశానికి, మన అంతరిక్ష పరిశోధన రంగానికి గర్వకారణమని కొనియాడారు ఆయన. మన శాస్త్రవేత్తలకు దేశం సెల్యూట్‌ చేస్తోందని ట్వీట్‌ చేశారు మోడీ.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy