ఇస్రో సెంచరీ హిట్ : PSLV C-40 సూపర్ సక్సెస్

PSLV-C40పీఎస్‌ఎల్‌వీ-సి40 శుక్రవారం ఉదయం 9.29 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 31 ఉపగ్రహాలను తీసుకెళ్లింది రాకెట్. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2ఇ, ఒక నానో శాటిలైట్‌, ఒక సూక్ష్మ ఉపగ్రహం ఉన్నాయి. వీటి ప్రయోగంతో భారత్‌కు చెందిన మొత్తం వంద ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినట్లవుతుంది. 2018లో ఇదే మొదటి ప్రయోగం కావడంతో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇస్రో 100వ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు ఇస్రో సైంటిస్టులు. దేశ ప్రజలకు 2018 కానుక ఇదేనన్నారు ప్రాజెక్ట్ డైరెక్టర్ కున్నికృష్ణన్. కొత్త సంవత్సరంలో సాధించిన విజయమని.. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. టీమ్ స్పిరిట్ తో పని చేశామని.. 2018లో శుభారంభం చేశామన్నారు ఇస్రో  చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్.

సీ-40 ఉపగ్రహం ఇస్రోకు చాలా ముఖ్యమని.. ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నామన్నారు కొత్త చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్న కె.శివన్. ఇది సమష్టి విజయమని.. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నామన్నారు. వినూత్న ఆలోచనలతో.. ఇస్రో ముందుకు వెళుతున్నామన్నారు. ఒక అపజయం తర్వాత తక్కువ వ్యవధిలో విజయం సాధించామన్నారు. మనపై విదేశాలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టామన్నారు శివన్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy