ఈజిప్టులో బస్సుపై కాల్పులు.. 24 మంది మృతి

egyptఈజిప్ట్‌లో బస్సులపై కాల్పులు జరిపారు ముష్కరులు. ఈ ఘటనలో 24 మంది చనిపోగా.. 25 మందికి గాయాలయ్యాయి. మిన్యా ప్రావిన్స్‌లో జరిగింది ఈ దుర్ఘటన. రెండు బస్సుల్లో కాప్టిక్ క్రిస్టియన్లను సెయింట్ సామ్యూల్ మోనెస్టరీకి తీసుకెళ్తుండగా ఈ దారుణంగా జరిగింది.  గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో కాల్పులు జరుగడం గమనార్హం. అయితే ఈ కాల్పులకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాల్పులకు పాల్పడిన దుండగుల కోసం భద్రతా దళాలు గాలింపును ముమ్మరం చేశాయి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy