ఈడెన్ టెస్ట్ : కోహ్లీ హాఫ్ సెంచరీ.. పుజారా కొత్త రికార్డు

kohliశ్రీలంకతో ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న తొలి టెస్టులో హాఫ్ సెంచరీ చేశాడు కోహ్లీ. 80 బంతుల్లో ఆరు ఫోర్లతో కోహ్లి 50 పరుగులు చేశాడు. ఇది కోహ్లి టెస్టు కెరీర్ లో 15వ హాఫ్ సెంచరీ. మరో విశేషం ఏంటంటే.. ఈడెన్ గార్డెన్ లో కోహ్లికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఇప్పటివరకు తన టెస్టు కెరీర్ లో 17 సెంచరీలను కోహ్లి సాధించాడు. ఇందులో నాలుగు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఈడెన్ లో మాత్రం తొలిసారి సత్తాచాటాడు. భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్ గా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. సోమవారం చివరి రోజు ఆటలో బ్యాటింగ్ కు దిగిన కోహ్లి లంచ్ తర్వాత హాఫ్ సెంచరీ మార్క్ను చేరాడు.

ఇదిలా ఉంటే చతేశ్వర పుజారా అరుదైన రికార్డు సాధించాడు. టెస్ట్‌లో ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన బ్యాట్స్‌మన్‌గా పుజారా నిలిచాడు. ఈ ఘనత సాధించిన మూడో ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. పుజారా కంటే ముందు ఎంఎల్ జయసింహ, రవిశాస్త్రి ఈ అరుదైన ఘనత సాధించారు. తొలి రోజు తొలి బంతికే రాహుల్ ఔటవడంతో పుజారా క్రీజులోకి వచ్చాడు. తొలి రోజు కేవలం 11.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కావడంతో అతను నాటౌట్‌గా నిలిచాడు. రెండో రోజు కూడా కేవలం 21 ఓవర్ల ఆటే సాగడంతో ఓవైపు వికెట్లు పడిపోయినా.. పుజారా మాత్రం క్రీజులో నిలదొక్కుకున్నాడు. చివరికి మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 52 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. ఇక నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో శిఖర్ ధావన్ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన పుజారా.. ఐదో రోజు 22 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. ఇలా టెస్ట్ మ్యాచ్‌లో ప్రతి రోజు ఆడిన ఘనతను అతను సొంతం చేసుకున్నాడు.

అంతకుముందు 171/1 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఆఖరి రోజు ఆట ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే షాకిచ్చాడు లక్మల్. తొలుత కేఎల్ రాహుల్(79, 125 బంతుల్లో8 ఫోర్లు) ను అవుట్ చేసిన లక్మల్.. కాసేపటికి చతేశ్వర పుజారా(22), అజింక్యా రహానే(0) వరస బంతుల్లో అవుట్ చేశాడు. 21 పరుగుల వ్యవధిలో ముగ్గురు టాపార్డర్ ఆటగాళ్లను లక్మల్ అవుట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, భవనేశ్వర్ కుమార్ ఉన్నాడు. భారత్ స్కోర్ 84 ఓవర్లలో ఏడు వికెట్లకు 314 పరుగులు చేసింది. 192 పరుగుల లీడ్ లో ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy