ఈడెన్ టెస్ట్: లంకకు 122 పరుగుల ఆధిక్యం

IND-SRIఇండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కీలకమైన ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. నాలుగో రోజు రెండో సెషన్లో 294 పరుగులకు ఆలౌటై.. 122 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. టెయిలెండర్లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. రంగన హెరాత్ (67) హాఫ్ సెంచరీ ఈ మ్యాచ్‌లో శ్రీలంకను పటిష్ఠ స్థితిలో నిలిపింది. ఒక దశలో 201 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన లంకను హెరాత్ ఆదుకున్నాడు. అతనికి పెరీరా (5), లక్మల్ (16) మంచి సహకారం అందించారు. పెరీరాతో కలిసి 8వ వికెట్‌కు 43, లక్మల్‌తో కలిసి 9వ వికెట్‌కు 46 పరుగులు జోడించాడు హెరాత్. బ్యాటింగ్‌కు కష్టమైన ఈ పిచ్‌పై ఒక్కో పరుగు ఎంతో విలువైనది. అలాంటిది ఏకంగా 122 పరుగుల కీలకమైన ఆధిక్యంలో ఉన్న శ్రీలంక.. ఒకరకంగా మ్యాచ్‌పై పట్టు బిగించినట్లే. ఇక మిగిలి ఉన్న నాలుగున్నర సెషన్ల ఆటలో టీమిండియా కనీసం డ్రాతో గట్టెక్కడానికి ప్రయత్నించాల్సిందే. భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, షమి చెరో 4 వికెట్లు.. ఉమేష్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నాడు.

శ్రీలంకతో టెస్ట్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్ లో 172 పరుగులకు భారత్ ఆలౌట్ అయ్యింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 294 పరుగులు చేసింది. దీంతో 122 పరుగుల తొలి ఇన్నింగ్స్ డిఫిషియట్ తో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy