ఈఫిల్ టవర్ ని మూసేశారు

_85651780_85649343టెర్రర్ అటాక్స్ కి కొత్త దారులు వెతుక్కుంటున్నారు ఉగ్రవాదులు. అమాయక ప్రజలను బలితీసుకోవడమే కాకుండా చారిత్రక సంపదను ధ్వంసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. తాజాగా ఫ్రాన్స్ లోని ఈఫిల్ టవర్ పై టెర్రర్ అటాక్ జరగనుందన్న ఇన్ఫర్మేషన్ అందర్నీ టెన్షన్ పెట్టింది.

ఆదివారం ఉదయం ఐదున్నర ప్రాంతంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు భారీ బ్యాగులతో టవర్ పైకి వెళ్లారని పోలీసులుకు సమాచారం అందింది. దీంతో వారు ఉగ్రవాదులన్న అనుమానంతో టవర్ పై కి రాకపోకలను నిలిపివేసి గాలింపు చేపట్టారు. టూరిస్ట్ లపై ఆంక్షలు విధించారు పోలీసులు.. ఇష్యూ తెలియగానే యాంటీ టెర్రరిస్ట్ టీం హెలిప్యాడ్ తో టవర్ చుట్టూ సెర్చింగ్ మొదలుపెట్టింది. నిందితులెవరూ దొరక్కపోవడంతో ప్యారాచూట్ సాయంతో తప్పించుకుని ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. పారిపోయేముందు టవర్ పై పేలుడు పదార్ధాలు ఏవైనా ఉంచారన్న అనుమానంతో టూరిస్ట్ లను టవర్ పైకి అనుమతించలేదు. ఇష్యూ తేలేంత వరకు ఎవరినీ అనుమతించకుండా టవర్ మొత్తం చెక్ చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే మళ్లీ పర్యాటకులను టవర్ పైకి అలో చేయనున్నారు. డైలీ వేలమంది విజిట్ చేసే ఈ టవర్ పై అటాక్ జరగనుందన్న న్యూస్ టూరిస్ట్ లను  కలవర పెడుతోంది.  ఫ్రాన్స్  కు గర్వకారణమైన ఈ కట్టడంపై ఉగ్రదాడికి పాల్పడబోయింది ఎవరన్న దానిపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy