ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

జనరల్ కోటాలోని పేదలకు పదిశాతం రిజర్వేషన్లు ఇచ్చే బిల్లుకు రాష్ట్రపతి కార్యాలయం ఆమోదించింది. దీంతో.. కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను విడుదలచేసింది. అగ్రవర్ణాలు, అన్ని మతాల్లోని పేదలకు ఉద్యోగాలు, విద్యలో 10% రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాల ప్రజల కోసం తయారుచేసిన ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. దేశంలో 50% రిజర్వేషన్ దాటొద్దన్న రాజ్యాంగ నిబంధనను సవరించేందుకు  124 అమెండ్ మెంట్ బిల్లు ఇటీవల లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందింది. ఈబిల్లును కూడా రాష్ట్రపతి అప్రూవ్ చేశారు. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు… గెజిట్ నోటిఫికేషన్ తో చట్టంగా మారింది. ఇకనుంచి అగ్రవర్ణాలు, అన్నిమతాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లు లభించనున్నాయి.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy