ఈరోజు మోడీ ఫినిష్ అవుతాడా?

modi

భావి ప్రధాని గా ప్రపంచమంతా చర్చించుకుంటున్న వివాదాస్పద నాయకుడు నరేంద్ర మోడీ రాజకీయ భవిషత్తులో ఈ రోజు కీలక మలుపు వచ్చే అవకాశం ఉంది. గోద్రా అల్లర్ల అనంతరం గుజరాత్ లో చెలరేగిన కల్లోలంలో నాటి ముఖ్య మంత్రి మోడీ పాత్ర, ప్రోత్సాహం ఉందనే విషయం కొందరు గుసగుసగా, మరికొందరు బాహాటంగానే చెబ్తున్నా, ఏ కోర్టులో కూడా ఆరోపణ రుజువు కాలేదు.

గుల్బర్గా సొసైటీ అనే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కూడా జరిగిన నాటి మారణకాండలో మరణించిన కాంగ్రెస్ నేత ఎహసాన్ జాఫ్రీ భార్య, జకియా జాఫ్రీ, మోడీ తదితరులపై వేసిన కేసు కూడా ఆధారాలు లేని కారణంగా SIT కోర్టు తిరస్కారానికి గురయ్యింది. జకియా SIT కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా అహ్మదాబాద్ లోని magisterial కోర్టులో అప్పీల్ చేసారు. నాడు మోడీ ప్రభుత్వంలో అధికారిగా పనిచేసి, అల్లర్లలో మోడీ పాత్రను విశదీకరించిన సంజీవ్ భట్ అఫిడవిట్ ను SIT కోర్టు నిరాకరించడం తప్పని ఈమె ప్రధాన ఆరోపణ. అమికస్ క్యూరీ రాజూ రామచంద్రన్, మోడీ పాత్రపై ఇచ్చిన రిపోర్ట్ కూడా ఈ కేసులో ప్రధానమైనదే. జకియా చేసిన ఈ అప్పీల్ పై అహ్మదాబాద్ కోర్టు ఈ రోజు నిర్ణయం వెల్లడించవచ్చునని తెలుస్తుంది.

మొత్తానికి మోడీ + BJP భవిష్యత్తే కాదు, కాంగ్రెస్ భవిష్యత్తు, మొత్తంగా దేశ భవిష్యత్తు మార్చేంత ముఖ్యమైన నిర్ణయం రానుందా? కొద్ది గంటలే wait చేయాల్సింది!

update:

The Ahmedabad magisterial court has vindicated the stand taken by SIT on investigating Modi. It had dismissed the petition by Zakia Jaafri. Mrs Zakia announced her decision to approach the higher courts.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy