ఈరోజు స్టాక్ మార్కెట్ అప్ డేట్

sxగత ఆరు ట్రేడింగ్ సెషన్స్ లో ఒక రోజు మాత్రమే లాభపడ్డ స్టాక్ మార్కెట్లు ఇవ్వాళ ఫ్లాట్ గా క్లోజయ్యాయి..నిన్న చైనా మ్యానుఫాక్చరింగ్ డాటా అంచనాల కంటే తక్కువగా ఉందని వచ్చిన వార్తలకుతోడు అమెరికా, బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థలు ఇంకా వీక్ గానే ఉన్నాయనే సంకేతాలతో స్థాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇవ్వాళ కూడా ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నం రెండు గంటల తరువాత లాభాల్లోకి మళ్లాయి. ఓ దశలో నిఫ్టీ కీలకమైన 6000 వేల పాయింట్లు బ్రేక్ చేసింది. డే లో లేవల్ నుంచి 85 పాయింట్ల మేర లాభపడిని నిఫ్టీ చివరకు 6000 వేల పాయింట్ల వద్ద ఫ్లాట్ గా క్లోజయ్యింది..నష్టాలతో ప్రారంభమైన బాంబే స్టాక్ ఎక్చేంజ్ ..సెన్సెక్స్ కూడా భారీ ఒడిదుకులకులోనైంది. మూడు నెలల కనిష్ఠి స్థాయిని తాకిన సెన్సెక్స్ 20000 పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు నిన్నిటి క్లోజింగ్ తో పోలిస్తే  రెండు పాయింట్లు లాభపడి 20211 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. బ్యాంకింగ్, FMCG, టెలికాం, పవర్, ఆటో సెక్టార్లు లాభపడ్డాయి. NTPC, పంజాబ్ నెషనల్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్ మూడు శాతం లాభపడగా..HCL టెక్, NMDC,  మహీంద్రా అండ్ మహీంద్ర మూడు శాతానికి పైగా నష్టపోయాయి

పాండురంగా రెడ్డి, బ్యూరో చీఫ్, V6 న్యూస్

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy