ఈశాన్య రాష్ట్రాలకు.. సైన్స్ ఎక్స్ ప్రెస్

Science-expressపర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన 9వ సైన్స్ ఎక్స్ ప్రెస్ ఢిల్లీలో ప్రారంభమైంది. కేంద్రమంత్రులు అనిల్ దవే, హర్షవర్ధన్ సైన్స్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు గోవా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తిగా సౌరశక్తితో నడిచే ఈ రైలు..  సెప్టెంబర్ 8 వరకు.. దేశంలోని 68 ప్రాంతాల్లో 19 వేల కిలోమీటర్లు ప్రయాణించనుంది.

ఢిల్లీలో ప్రారంభమైన సైన్స్ ఎక్స్ ప్రెస్ తొలిసారి ఈశాన్య రాష్ట్రాల్లో ప్రయాణించనుంది. దక్షిణ భారత దేశం మీదుగా గుజరాత్  రాజధాని గాంధీనగర్ లో ముగియనుంది. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ట్రైన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యానిమేషన్ తో పాటు త్రీడీ ఫొటోల ద్వారా పర్యావరణ పరిరక్షణ చర్యలను సైన్స్ ఎక్స్ ప్రెస్ వివరించనుంది.

సైన్స్ ఎక్స్ ప్రెస్ లో మొత్తం 16 ఏసీ కోచ్ లు ఉన్నాయి. పర్యావరణంలో వచ్చే మార్పులతో జరిగే పరిణామాలను 8 కోచ్ లలో ప్రదర్శిస్తున్నారు. మానవాళి జీవనంలో వస్తున్న మార్పులను, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాల్సిన ఆహారపు అలవాట్లను ప్రత్యేకంగా వివరిస్తున్నారు.

సైన్స్ ఎక్స్ ప్రెస్ తెలుగు రాష్ట్రాల్లోని కొత్తవలస, గుడివాడ, కోడూరు, కల్లూరు, మిర్యాలగూడలో ఆగనుంది.

పర్యావరణ మార్పులపై ప్రజలకు ఓ ఉద్యమంలా అవగాహన కల్పించాలంటున్నారు అధికారులు. సైన్స్ ఎక్స్ ప్రెస్ ద్వారా ప్రజలకు వాతావరణంలో వస్తున్న మార్పులతో పాటు ఎలా వ్యవహరించాలనేది తెలుస్తుందంటున్నారు.

దేశవ్యాప్తంగా ఒక్కో పట్టణంలో 2 నుంచి 4 రోజుల పాటు సైన్స్ ఎక్స్ ప్రెస్ అందుబాటులో ఉంటుంది. సైన్స్ ఎక్స్ ప్రెస్ ను విద్యార్థులు సందర్శించి పర్యావరణంపై మరింత అవగాహన పెంచుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy