ఈసారి ఎవర్నీ వదలం : పవన్ పై నీచ రాజకీయాలు చేస్తున్నారు

pawan
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై వ్యక్తిగతంగా నీచాతి నీచంగా రాజకీయాలు చేస్తున్నారని.. ప్రజల అండదండలతో సమర్దవంతంగా ఎదుర్కొంటాం అన్నారు ఆయన అన్నయ్య, నిర్మాత నాగబాబు. మెగా ఫ్యామిలీ సినిమాల్లో ఉంటే ఎవరూ ఏమీ అనటం లేదు.. రాజకీయాల్లోకి వస్తే చాలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న పవన్.. అన్నీ వదులుకుని ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాడని.. అలాంటి వ్యక్తిపై వ్యక్తిగతంగా ఇన్ని కుట్రలు చేయాల్సిన అవసరం ఏంటో వారికే తెలియాలి అన్నారు. ఏప్రిల్ 22వ తేదీ ఆదివారం రాత్రి ఏపీ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మిలటరీ మాధవరంలో అల్లు అర్జున్ నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా మూవీ ఆడియో ఫంక్షన్ లో ఈ వ్యాఖ్యలు చేశారు నాగబాబు.

పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఏమీ చేయలేక వ్యక్తిగతంగా పరువు తీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లందరి దుమ్ముదులిపే రోజులు వచ్చాయన్నారు. ఓసారి ఈ కుట్రలను ఎదుర్కోవటం కుదర్లేదు.. ఈసారి మాత్రం అలా కాదు.. కుదిరి తీరుతుంది.. వారికి తగిన గుణపాఠం చెబుతాం అన్నారు. వీళ్లందరికీ దుమ్ముదులపటానికి పవన్ కల్యాణ్ వస్తున్నాడు అన్నారు. తమ్ముడు ఒక్కడే అనుకుంటున్నారని.. కానీ ఆయన వెనకాల లక్షల మంది అభిమానులను దేవుడు ఇచ్చారన్నారు.

హీరో అల్లు అర్జున్ కూడా పవన్ కల్యాణ్ పై జరుగుతున్న కుట్రపై మొదటిసారి నోరువిప్పారు. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని.. కోట్ల రూపాయలు వదులుకుని ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆయన వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయించి ఇలా కుట్రలు చేయటం దారుణం అన్నారు. ఇలాంటి విమర్శలు, ఆరోపణలు, కుట్రలతో ఒకరిని నాశనం చేద్దాం అనుకుంటే.. ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు అన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy