ఈసారి ఫ్యాన్స్ కి రివర్స్ షాకిచ్చిన సమంత

sam-glamటాలీవుడ్ క్యూట్ గాళ్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ స‌మంత సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌నక్క‌ర్లేదు. త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ప్ప‌టికి వెరైటీ డ్రెస్ ల‌లో ఈ అమ్మ‌డు చేస్తున్న గ్లామ‌ర్ షో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. చేనేత వ‌స్త్ర ప్ర‌చార‌ణ‌లో భాగంగా స‌మంత రీసెంట్ గా కొన్ని ఫోటోలు త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ గా మారాయి. ఆ త‌ర్వాత కొద్ది సేప‌టికే హాఫ్ శారీలో ఉన్న ఫోటోని పోస్ట్ చేసి ఔరా అనిపించింది. రెడ్ క‌లర్ హాఫ్ శారీ ధ‌రించి మ‌బ్బు వైపు చూస్తున్న‌ట్టుగా ఉన్న ఆ పిక్ స‌మంతలో దాగి ఉన్న వేరియేష‌న్స్ చూపించింది. అయితే ఈ పిక్ త‌మిళ హీరో శివ‌కార్తికేయ‌న్ ప్రధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న మూవీకి సంబంధించిన‌దిగా తెలుస్తుంది. పోన్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, రీసెంట్ గా స‌మంత  షూటింగ్ లో జాయిన్ అయింది. రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో సామ్ ప‌ల్లెటూరి గార్ల్ గా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. సిమ్రాన్, సూరీ, నెపోలియ‌న్, లాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. మ‌రోవైపు స‌మంత  “రంగ‌స్థ‌లం 1985” చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, ఇందులోను సామ్ ప‌ల్లెటూరి అమ్మాయిగానే క‌నిపించ‌నుంద‌ని టాక్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy