ఈసారి లాంగ్ వీకెండ్ : బ్యాంకులకు వరుస సెలవులు

BANKశనివారం (ఏప్రిల్-28) నుంచి నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఏప్రిల్ 28వ తేదీ నాలుగో శనివారం, ఏప్రిల్ 29వ తేదీ ఆదివారం రెగ్యులర్ హాలిడే, ఏప్రిల్ 30 సోమవారం బుద్ధ పూర్ణిమ, మే 1 మంగళవారం మే డే కావడంతో బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. అయితే సోమవారం, మంగళవారం, అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి బ్యాంకులు మూసివేయరు. నెగోషియబుల్‌ ఇన్‌ స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ ప్రకారం బ్యాంకులు ఈ సెలవులను పాటిస్తాయి.

సోమవారం(ఏప్రిల్-30).. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, హర్యానాలో బ్యాంకులు సెలవులు ఇస్తుండగా.. మంగళవారం (మే-1) కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గోవా రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవులను పాటించనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సోమ, మంగళవారాలు సెలవు ప్రకటించాయి. ఇక ఐటీ ఉద్యోగులు అయితే సోమవారం లీవ్ తీసుకుంటున్నారు. లాంగ్ వీకెండ్ ను సమ్మర్ హాలిడేస్ కింద ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం సోమవారం ఆప్షన్ హాలిడే కింద తీసుకుంటున్నారు.

బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నప్పటికీ ATM లలో నగదు కొరత ఏర్పడకుండా అన్నీ చర్యలు తీసుకొంటున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. నగదు కొరతతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల ATMల్లో ఇంకా నగదు కొరత సమస్య మెరుగు పడలేదు.
 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy