ఈ అవమానాలేంటో : ట్రంప్ కు మరో షేక్ హ్యాండ్ షాక్

trump-poland-first-lady-handshake-759అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశీ పర్యటనల కంటే.. ఆ సమయంలో ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులే హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. ఆ మధ్య ఇజ్రాయెల్‌, రోమ్‌ పర్యటనలకు వెళ్లినప్పుడు భార్య మిలానియా చేతిని అందుకోడానికి ఆయన ప్రయత్నించగా, ఆమె ట్రంప్‌ చేతిని విదిలించుకున్న సందర్భాలు మీడియాకు చిక్కాయి. అది బాగా వైరలయ్యింది. తాజాగా పోలాండ్‌లోనూ అలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురైంది. పోలాండ్‌ ప్రథమ మహిళకు ట్రంప్‌ షేక్‌హ్యాండ్‌ ఇవ్వబోతుండగా.. ఆమె మాత్రం పట్టించుకోకుండా ఆయన భార్య మిలానియా వైపు వెళ్లడం కెమెరా కంట్లో పడింది.

పోలాండ్‌ వెళ్ళిన అగ్రరాజ్య అధినేతకు పోలాండ్‌ అధ్యక్షుడు ఆంద్రెజ్‌ దుడా స్వాగతం పలికారు. తొలుత ఆంద్రెజ్‌కు ట్రంప్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. ఆ తర్వాత పక్కనే ఉన్న పోలాండ్‌ అధ్యక్షుడి సతీమణి అగాటా కోర్న్‌హౌషర్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇస్తుండగా.. ఆమె మాత్రం ట్రంప్‌ను దాటుకుంటూ వెళ్లి మిలానియాకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ముచ్చటించారు. ఆ తర్వాత కాసేపటికి వెనక్కు తిరిగి ట్రంప్‌తో కరచాలనం చేశారు. ఈ సందర్భం కాస్తా మీడియా దృష్టిలో పడింది. ఇంకేముంది ట్రంప్‌ షేక్‌హ్యాండ్‌ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ వీడియోను కొందరు సోషల్‌మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ట్రంప్‌ను దాటుకుంటూ పోలాండ్‌ ప్రథమ మహిళ వెళ్తున్నప్పుడు ఆయన ముఖ కవళికలను చూసి.. అమెరికా అధ్యక్షుడికి మళ్లీ కోపం వచ్చింది అంటూ పలువరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy