ఈ ఆలయానికి ఉత్తర ద్వారం

NLGనల్గొండ జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెంలో వెలసిన స్వయంభు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో విశిష్ట ఉంది. రాష్ట్రంలోని ఆలయాలన్ని తూర్పు, దక్షిణ ద్వారాలుగా ఉండగా ఈ ఒక్క ఆలయం మాత్రమే ఉత్తర ద్వారం కలిగిఉంది. ఈ గుడి పక్కనే  నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఆలయంలో 40 అడుగుల శిల, లక్ష్మీదేవి పాదుకలు కనిపిస్తాయి. ఇక్కడే శ్రీవారు  వెలసినట్టు చరిత్ర చెబుతోంది. నడిగూడెం రాజావారికి  స్వామివారు కలలో కనిపించి  ఆలయం కట్టించాలని చెప్పారట. దీంతో కందూరు వంశీయుల సహాయంతో నడిగూడెం రాజవారు  ఆలయం కట్టించినట్లు  చరిత్ర  చెబుతోంది. 1854లో నడిగూడెం జమీందారు నాయిని రాణీరుక్కమ్మ ఆలయాన్ని పునర్నిమించినట్లు శాసనాల ద్వారా గుర్తించారు. ఈ పురాతన ఆయలానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఉత్తర ద్వార ఆలయం కావడంతో స్వామి వారి దర్శనం కోసం భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఏటా మాఘమాసంలో జరిగే జాతరకు పెద్ద సంఖ్యంలో భక్తులు తరలివస్తారు. ఎంతో విశిష్టత కలిగిన స్వయంభు వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలంటున్నారు భక్తులు. రాష్ట్రంలోనే ఉత్తర ముఖంగల ఏకైక వెంకటేశ్వరస్వామి ఆలయంపై ప్రభుత్వం నజర్ పెట్టాలంటున్నారు భక్తులు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy