ఈ ఇద్దరినీ బహిష్కరించలేమా.?

sachinరాజ్యసభ ఎంపీలు సచిన్, రేఖలపై తీవ్ర విమర్శలు చేశారు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్. రాజ్యసభ సమావేశాలకు హజరుకాని సచిన్, రేఖలను ఎందుకు బహిష్కరించలేమని ప్రశ్నించారు. సమావేశాలపై ఆసక్తి లేకపోతే సచిన్‌, రేఖ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం(ఆగస్ట్ 1) జరిగిన రాజ్యసభ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తిన ఎంపీ నరేశ్‌.. సచిన్‌, రేఖలను దేశం విడిచి పారిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాతో పోల్చడం గమనార్హం. ‘మాల్యాను సభ నుంచి బహిష్కరించగలిగితే.. సచిన్‌, రేఖలను కూడా బహిష్కరించలేమా?’ అని ప్రశ్నించారు. కాగా.. సచిన్‌, రేఖల హాజరుపై ఎంపీ నరేశ్‌ అగర్వాల్‌ విమర్శలు చేయడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది మార్చిలో పార్లమెంట్‌ సమావేశాలు జరిగిన సమయంలోనూ నరేశ్‌ దీని గురించి ప్రస్తావించారు.‘నామినేటెడ్‌ సభ్యులు సమావేశాలకు వస్తారని ఎంతో ఆతృతగా చూశాం. కానీ వారు రాలేదు. సమావేశాలు మొత్తం పూర్తయినా వారిని ఒక్కసారైనా చూడలేదు’ అని సచిన్‌, రేఖలనుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy