ఈ ఏటి వాల్డ్ ఛాంపియన్ జోడీ సానియా-హింగిస్‌

saniya-hingisఈ ఏడాది వరస విజయాలతో దూసుకెళ్లిన సానియా హింగిస్‌- జోడి మరో ఘనత సాధించింది. ఈ ఏటి ప్రపంచ ఛాంపియన్‌ జోడిగా వీరు ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌  ప్రకటించిన ఛాంపియన్‌ జాబితా-2015 మహిళల డబుల్స్‌ విభాగంలో సానియా-హింగిస్‌  జంట ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇండియన్ టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా ఈ ఏడాది మార్చిలో స్విస్‌ ప్లేయర్  మార్టినా హింగిస్‌తో జోడి కట్టింది. అప్పటి నుంచి ఈ జంట వెనుదిరిగి చూడలేదు. ఈ ఏడాది తొమ్మిది టైటిల్స్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇందులో రెండు గ్రాండ్‌స్లామ్‌లు కూడా ఉన్నాయి. ఏడాది ప్రారంభంలోనే వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ గెలుచుకున్న వీరు.. తర్వాత జరిగిన మరో ఏడు టోర్నమెంట్లలోనూ విజేతలుగా నిలిచారు.  మార్టిన్‌ హింగిస్‌ 15 ఏళ్ల తర్వాత వాల్డ్ ఛాంపియన్ గా నిలిచింది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy