ఈ ఏడాది ఉత్తమ వ్యక్తి ఇదే…

monkey-selfieఇండోనేషియాకు చెందిన ఈ కోతి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.  ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా నిలిచింది. ఈ విషయాన్ని జంతుసంరక్షణ హక్కుల బృందం ప్రకటించింది. దీనిపై పెటా(పీపుల్‌ ఫర్‌ ది ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌) ఆనందం వ్యక్తం చేసింది. ఇండోనేషియాలోని ఓ కోతి 2011లో తీసుకున్న సెల్ఫీ సంచలనమైంది. మకావ్‌ జాతికి చెందిన నారుటో అనే కోతి బ్రిటిష్‌ ఫొటోగ్రాఫర్‌ డేవిడ్‌ స్లేటర్‌ కెమెరాతో  ఫొటోలు దిగడంతో అప్పట్లో  వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలను తీసుకెళ్లి స్లేటర్‌ ఓ పబ్లిషింగ్‌ హౌస్‌కు విక్రయించారు. దాన్ని ఓ పుస్తకంలో ముద్రించడంతో విషయం తెలుసుకున్న పెటా అధికారులు సెల్ఫీ మీద కాపీ రైట్స్‌ కేసు వేశారు. ఆ సెల్ఫీ మీద ఉండే అన్ని హక్కులు కోతికి మాత్రమే ఉంటాయని, వాటిని ఎలా దుర్వినియోగం చేస్తారంటూ పెటా ప్రతినిధులు స్టేటర్‌పై 2014లో న్యాయస్థానంలో కేసు వేశారు. తొలుత ఈ కేసులో స్లేటర్‌ గెలుపొంది ఫొటో హక్కులను సొంతం చేసుకున్నాడు. దీన్ని సవాలు చేస్తూ పెటా అధికారులు పై కోర్టును ఆశ్రయించటంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేసు ఓ కొలిక్కి వచ్చింది. కోతి సెల్ఫీ వాడుకుంటే అందులో వచ్చే ఆదాయంలో 25శాతం దాన్ని సంరక్షణకు ఉపయోగించేందుకు స్లేటర్‌ ఒప్పుకొన్నాడు. ఇప్పుడు అదే కోతిని పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా జంతుసంరక్షణ బృందం ఎంపిక చేసింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy