ఈ ఏడాది నుంచే వ్యవసాయ పెట్టుబడి పథకం : కేసీఆర్

KCRరైతుకు సాగుకు పెట్టుబడి అంశంపై మంత్రులు, అధికారులతో ప్రగతి భవన్ లో రివ్యూ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, హరీష్ రావు, తుమ్మల, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు మీటింగ్ కు అటెండయ్యారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం ఈ ఏడాది నుంచే అమలవుతుందని ప్రకటించారు సీఎం. మే 15 వరకు మొదటి విడత ఎకరానికి 4 వేల చొప్పున రైతులకు అందిస్తామన్నారు.
వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకాన్ని ఎలా అమలు చేయాలి…? రైతులకు డబ్బులు నేరుగా అందివ్వాలా…? బ్యాంకులతో అందివ్వాలా? సాగు చేస్తున్న భూములను గుర్తించడం ఎలా…? ఏ ప్రాతిపదికన పెట్టుబడి అందించాలనే అంశాలను అధ్యయనం చేయడానికి వ్యవసాయశాఖ మంత్రి పోచారం అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. కమిటీలో మంత్రులు ఈటల, హరీష్, తుమ్మల , జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. ఇక ఈ ఏడాది నుంచి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెడతామని ప్రకటించారు CM. రైతులకు పెట్టుబడిగా అందించే నిధులతో పాటు, మద్దతు ధర కోసం కొంత నిధిని కూడా బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు.

రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు సీఎం. CCI లాంటి సంస్థలు పత్తి కొనుగోలు చేస్తున్నా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయన్నారు. రైతు సమన్వయ సమితిలతో ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి పంటలను కొనుగోలు చేసి, తిరిగి అమ్మాలన్నారు. పక్క రాష్ర్ట్రాల్లో మద్దతు ధర ఇచ్చే విషయంలో ఎలాంటి విధానాలు అమలవుతున్నాయో అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అధికారులు పర్యటించాలని సూచించారు. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ నాయకత్వంలో అధికారుల టీమ్ దేశవ్యాప్తంగా మద్దతు ధరలకు సంబంధించిన విధానాలను అధ్యయనం చేయాలన్నారు.

పంటలకు మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మరింత ఉదారంగా వ్యవహరించాల్సి ఉందన్నారు సీఎం. దేశంలో పండే పంటకు మద్దతు ధర ప్రకటించే విధంగా కేంద్రం ఓ విధానం తీసుకురావాలన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుతుందన్నారు. TRS MP లు పార్లమెంట్లో రైతుల మద్దతు ధర విషయంపై ప్రస్తావిస్తారన్నారు సీఎం. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, జెన్ కో, ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు, వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు అటెండయ్యారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించే విషయంలో వ్యవసాయ శాఖ కృషిని సీఎం అభినందించారు. అటు పెండింగ్ ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేస్తున్న ఇరిగేషన్ మంత్రి హరీశ్ కు కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో అత్యుత్తమ సేవలందించి కేంద్ర ప్రభుత్వం నుంచి సీబీఐపీ అవార్డు అందుకున్న జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావును అభినందించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy