ఈ గ్యారేజ్‌లో మ‌న‌సులు బాగుచేయ‌బ‌డును

6s-025 copyవ‌రుస హిట్ల‌తో ఫుల్ జోష్ మీదున్నారు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం జ‌న‌తా గ్యారేజ్.  ఈ భారీ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంతా, నిత్యామీన‌న్‌లు న‌టిస్తున్నారు.  మ‌ళ‌యాళం సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ ఇందులో ఓ ప్ర‌త్యేక పాత్ర‌ను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోను ఈ నెల 12న శిల్ప‌క‌ళా వేదిక‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రం ఒక హైలీ ఎమోష‌న‌ల్ మూవీ అని డైరెక్ట‌ర్ కొర‌టాల శివ అన్నారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టుగా దేవీ స్వ‌రాల‌ను స‌మ‌కూర్చార‌ని తెలిపారు. సాయి కుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్ ,సితార, దేవయాని వంటి ప్రఖ్యాత నటులు ఈ చిత్రం లో ముఖ్య పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

Janatha Garage Movie Photo Gallery

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy