
ప్రమాదకరమైన కెమికల్స్
కల్తీగాళ్ల కన్ను.. చాక్లెట్లపై పడింది. నూనె.. నెయ్యి.. మసాలా దగ్గర్నుంచి.. వాహనాల ఇంజన్ ఆయిల్ వరకూ దేన్నీ వదలని కేటుగాళ్లు.. ఇప్పుడు చాక్లెట్లనూ నకిలీ చేసేస్తున్నారు. అతి ప్రమాదకరమైన కెమికల్స్ తో చాక్లెట్లు తయారు చేస్తూ.. ఓ ముఠా సభ్యులు… చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఓల్డ్ సిటీలోని ఓ డెన్ వేదికగా… కల్తీ దందా చేస్తున్నారు. పోలీసుల కార్డన్ సర్చ్ ఈ నకిలీ దందా విషయం బయటికి వచ్చింది. కేన్సర్ కు కారణమయ్యే కార్సినోజెనిక్ లాంటి ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నట్టు పోలీసులు చెప్పారు.
రుచిలో తేడా రాదు
చూడ్డానికి ఏ మాత్రం డౌట్ రాదు. తింటే అచ్చం చాక్లెట్లలానే రుచిగా ఉంటాయి. కానీ.. మాల్ మొత్తం పక్కా నకల్. ఎవరికీ తెలియకుండా… విషయం బయటికి రాకుండా.. చాలా జాగ్రత్తగా జరుగుతోన్న ఈ నకిలీ దందా… సౌత్ జోన్ పోలీసుల కార్డన్ సెర్చ్ తో బయటికొచ్చింది. అచ్చం ఒరిజినల్ ప్రొడక్ట్ లాగే ఉండే నకిలీ చాక్లెట్లను.. బేగంబజార్ తో పాటు.. సిటీలోని చాలా హోల్ సేల్ మార్కెట్లలో అమ్ముతున్నట్టు తేలింది. దొరికిన నకిలీ మాల్ ను.. పోలీసులు ఎఫ్ఎస్ఎల్ పరీక్షల కోసం పంపించారు. జంట నగరాల్లో వరుసగా కల్తీ మాల్ దందాలు బయటపడుతుండడంతో… పోలీసులు అలర్ట్ అయ్యారు. మరిన్ని తనిఖీలు చేసి.. నకిలీ సరుకు ముఠాల ఆట కట్టించేందుకు ప్లాన్ చేస్తున్నారు.