ఈ జాబ్ మేళా అమ్మాయిలకు స్పెషల్

lady-employనిరుద్యోగ యువతులకు కోసం నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ విద్యాసంస్థలో ఈ నెల 25న భారీ జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈఎస్ఐసీ బోర్డు సభ్యుడు, జాబ్‌మేళా చీఫ్‌ కో-ఆర్డినేటర్‌ కె.దిలీప్ కుమార్‌ తెలిపారు. 2వేల మందికి ఉద్యోగాలొచ్చేలా కార్యక్రమాన్ని చేపట్టామన్నారాయన. నిరుద్యోగ యువతులు, మహిళలు ముఖ్యంగా బీటెక్‌ అమ్మాయిలు ఈ జాబ్ మేళాను ఉపయోగిచుంకోవాలన్నారు.

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ సహకారంతో నిర్వహిస్తున్న ఈ జాబ్‌మేళాలో 60కి పైగా ప్రముఖ సంస్థలు ఈ జాబ్‌మేళాలో పాల్గొంటున్నారన్నారు జాబ్ మేళా కోఆర్డినేటర్ దిలీప్. ఉద్యోగంరాని వారికి  కెరీర్‌ కౌన్సెలింగ్‌ ఇప్పిస్తామన్నా రు. నిరుద్యోగ యువతులు, మహిళలు జాబ్‌మేళా పేర్లను రిజిష్టర్ చేసుకోవచ్చన్నారు. వివరాలకు www.jobmela.online లోకి వెళ్లి తెలుసుకోవచ్చు లేదా  97000 00693/99896 31856/98664 61572 నంబర్ లలో సంప్రదించవచ్చు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy