ఈ తల్లి ధైర్యానికి వందనం : తుపాకీ బుల్లెట్లను తట్టుకుని పుట్టిన చిన్నారి

babyజమ్మూకశ్మీర్‌ సంజువాన్‌లోని ఆర్మీ క్యాంపుపై శనివారం (ఫిబ్రవరి-10) జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు చనిపోయారు. ఇదే కాల్పుల్లో గాయడిన ఓ ప్రెగ్నెంట్ లేడీ… ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. రైఫిల్‌ మ్యాన్ నజీర్‌అహ్మద్‌తో పాటు ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. నిండు గర్భిణి అయిన ఆమెను వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌లో జమ్ములోని  సైనిక ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆదివారం(ఫిబ్రవరి-11) రాత్రి సిజేరియన్ తర్వాత ఆడశిశువుకు జన్మించ్చింది. తల్లీకూతుళ్లు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆర్మీ డాక్టర్లు తెలిపారు.

ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బాధితురాలి వెన్నెముకకు బుల్లెట్ తగిలింది. అయితే ఆమె కడుపులో ఉన్న పాపకు చిన్న గాయం కూడా కాలేదు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy