ఈ నటుడు పెద్ద పోకిరి..

738629515ట్విట్టర్ లో ఇప్పటికే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన బాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమల్ రషీద్ ఖాన్ పై తాజాగా ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బాలీవుడ్ హీరోయిన్లతో పాటు మోడల్స్ కు సంబంధించి అభ్యంతకర వ్యాఖ్యలు, ఫోటోలు ట్విట్టర్ లో  పోస్ట్ చేస్తున్నాడని రషీద్ ఖాన్ పై రిజ్వాన్ సిద్ధిఖి అనే లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంలో ఏ హీరోయిన్, మోడల్ కానీ రషీద్ ఖాన్ పై కేసు వేయాలని కోరలేదని.. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తనంటతానే కేసు వేశానని ఆయన తెలిపారు.విషయం తెలుసుకున్న మహారాష్ట్ర స్టేట్ వుమెన్ కమిషన్ రషీద్ ఖాన్ పై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై జాతీయ మహిళ కమిషన్ కూడా జోక్యం చేసుకుంది. మరోవైపు పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy