ఈ నెల 15 వరకే “సరి-బేసి” విధానం

Roadside Pollution as India Joins List Of Biggest Historical Contributors To Global Warmingఢిల్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన ‘సరి-బేసి’ విధానం ఈనెల 15తో ముగుస్తుందని ఆప్‌ సర్కారు స్పష్టం చేసింది. ఢిల్లీ నగరంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం  15రోజుల పాటు ట్రయల్‌ రన్‌గా సరి-బేసి విధానాన్ని అమలు చేస్తోంది. అయితే  దీనిని అవసరమయితే మరింత పొడిగించనున్నట్లు ఆప్‌ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అయితే ఈ విధానాన్ని పొడిగించడం లేదని.. 15వ తేదీ వరకే అమలు చేస్తామని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ తెలిపారు. 15రోజుల ట్రయల్‌ రన్‌పై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని.. ఆ తర్వాతే దీని పొడిగింపు గురించి ఆలోచిస్తామన్నారు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy