ఈ నెల 16న ఉద్యోగ, ఉపాధ్యాయ,ఆర్టీసీ సంఘాలతో సీఎం భేటీ

kcr1ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ సంఘాలతో ఈ నెల 16న సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం… ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి సీఎంకు నివేదిక సమర్పించింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై సీఎస్, ఉన్నతాధికారులతో చర్చించారు సీఎం. ఉద్యోగుల అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం, అధికారులు మరోసారి అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతోనూ చర్చలు జరపాలని మంత్రివర్గ ఉపసంఘానికి ఆదేశాలు జారీచేశారు. మంత్రివర్గ ఉపసంఘంలో రవాణాశాఖ మంత్రిని కూడా చేర్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ నాయకులతో ఈ నెల 16న సీఎం భేటీకానున్నారు. సమావేశం పూర్తవగానే తీసుకున్న నిర్ణయాలు తెలియజేయనున్నారు.PRC నివేదిక ఇవ్వడానికి  ఇంకా సమయం పడుతుందన్న సీఎం.. మూస పద్ధతికి స్వస్తి పలికి వేగంగా పని పూర్తి చేయాలన్నారు. పని త్వరగా పూర్తవడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy