ఈ నెల 18న పళని బలపరీక్ష

palaతమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ నెల 18న (శనివారం) అసెంబ్లీ వేదికగా బలాన్ని నిరూపించుకోబోతున్నారు. శనివారం ప్రత్యేకంగా రాష్ట్ర శాసనసభ ఇందుకోసం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పళనిస్వామి మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు పళనిస్వామి ప్రమాణస్వీకార వేడుకలో పాల్గొన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తిరిగి కువత్తూరులోని గోల్డెన్‌ బే రిసార్ట్‌కు వెళ్లారు. బలనిరూపణ జరిగేవరకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇక్కడ బస చేయనున్నారు. రాజ్‌భవన్‌లో కొత్త సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అక్కడి నుంచి నేరుగా రిసార్ట్‌కు వచ్చేశారు.

అసెంబ్లీ వేదికగా బలపరీక్షకు గవర్నర్‌ 15రోజుల గడువు ఇచ్చినప్పటికీ.. ఈ వ్యవహారాన్ని సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసి.. మెజారిటీ చాటుకోవాలని పళనివర్గం భావిస్తున్నది. తమకు ప్రస్తుతం 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆ వర్గం చెబుతున్నది. బలపరీక్ష నాటికి పన్నీర్‌ గూటికి చేరిన మిగతా ఎమ్మెల్యేలు కూడా తమవైపు వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy