ఈ నెల 21న తిరుమలకు సీఎం

KCR-Tirumala-TTDశ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఈనెల 21న  తిరుమలకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. శ్రీవారిని దర్శించుకొని 5 కోట్ల  విలువైన  ఆభరణాలను సమర్పించనున్నారు. కోయంబత్తూర్ లో వీటిని తయారు చేయించింది టీటీడీ.

ఏడుకొండల వాడికి మొక్కులు చెల్లించుకునేందుకు ఈ నెల 21 న ప్రత్యేక విమానంలో  కుటుంబ సభ్యులతోపాటు  తిరుపతికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. రాత్రి కొండపై బస చేసి,  22 ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. మంత్రులు, అధికారులు కూడా సీఎంతో పాటు తిరుమలకు వెళ్లనున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే  బంగారు కాసుల పేరు చేయిస్తానని గతంలో వెంకన్నకు మొక్కుకున్నారు కేసీఆర్. కల సాకారం కావడంతో ఆభరణాలు సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. గతంలోనే తిరుమలకు వెళ్లాలని  సీఎం భావించినప్పటికీ… బిజీ షెడ్యూల్ వల్ల టూర్  వాయిదా పడింది.

స్వామివారి కోసం 5 కోట్ల విలువైన నగలు చేయించారు కేసీఆర్. ఇందులో 3. 7 కోట్లతో  14. 2 కిలోల సాలగ్రామ హారం 1. 21 కోట్లతో  4. 65 కిలోల కంఠాభరణం ఉన్నాయి. వీటిని కోయంబత్తూరులోని ఓ జ్యువెలరీ కంపెనీతో తయారు చేయించింది టీటీడీ. ప్రస్తుతం ఈ ఆభరణాలను టీటీడీ ఖజానాలో భద్రపరిచారు.

వెంకన్నకు మొక్కులు చెల్లించుకున్న తర్వాత తిరుపతిలోని  అలివేలు మంగాపురంలో అమ్మవారిని దర్శించుకుంటారు కేసీఆర్. అమ్మవారికి  బంగారు ముక్కుపుడక సమర్పించుకుంటారు. అక్కడి నుంచి   హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు. 2010లో తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న టైమ్ లో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కుకున్నారు కేసీఆర్.

ప్రత్యేక  రాష్ట్రం ఏర్పడిన తర్వాత  వేములవాడ రాజన్న తో పాటు వరంగల్  భద్రకాళీ కి 3.70 కోట్లతో 11 కిలోల 700 గ్రాముల బంగారు కిరటీటాన్ని సమర్పించారు కేసీఆర్. కురవి వీరభద్ర స్వామి కి  బంగారు మీసాలు, విజయవాడ కనకదుర్గమ్మ కు  నగలు చేయించిన సిఎం త్వరలోనే వాటిని సమర్పించనున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy