ఈ నెల 23న GHMC ఎన్నికలు జరిగే అవకాశం

GHMC 1గ్రేటర్ వార్ కు నగారా మోగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కు రెడీ అయ్యింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇవాళ ఉదయం వార్డుల రిజర్వేషన్ ఖరారు కావడంతో పాటు సాయంత్రం ఎన్నికల నోటఫికేషన్ రిలీజయ్యే ఛాన్సుంది. ఈ నెల 23న పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు గడువులోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా రెడీ చేసింది. ఎన్నికల నిర్వహణకు RO, ARO లకు రెండు రోజులు శిక్షణకు ఏర్పాట్లు చేసింది.

పోలింగ్ పర్సెంటేజీపైనా స్పెషల్ నజర్ పెట్టింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఇచ్చింది.  ప్రత్యేక యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలను తెలుసుకునే ఫెసిలిటీ కల్పించింది. ఎన్నికలకు 80వేల మంది పోలీసులతో సెక్యూరిటీ అరేంజ్ చేస్తోంది.  గ్రేటర్ నోటిఫికేషన్ రానుందని తెలియడంతో  పార్టీలు అలర్టయ్యాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై కసరత్తు చేస్తున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy