ఈ నెల 7న వస్తున్న ‘జోరు’…

ఇప్పటికే వరస సినిమాలతో జోష్ మీద ఉన్న సందీప్ కిషన్ ‘జోరు’ పెంచాడు. ‘జోరు’ మూవీతో ఈ నెల  7న ఆడియన్స్ ముందుకు రానున్నాడు. శ్రీ కీర్తి ఫిలిమ్స్ బ్యానర్ పై ‘గుండెల్లో గోదారి’ మూవీ డైరెక్టర్ కుమార్ నాగేంద్ర డైరెక్షన్ లో ‘జోరు’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో ‘ఉహలు గుసగుసలాడే’ ఫేం రాషీ ఖన్నా, ప్రియా బెనర్జీలు నటిస్తున్నారు. ఈ మూవీలో బ్రహ్మానందం, సప్తగిరి, పృధ్వీ, షియాజీ షిండే కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ‘జోరు’ మూవీ ఇప్పటికే సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ నెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy