ఈ పోలీసులు దేశముదుర్లు : మార్ఫింగ్ ఫొటోలతో ఎవరెస్ట్ కీర్తి

mountainమౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించకుండానే … ఎక్కామంటూ పుణెకు చెందిన ఓ భార్యాభర్తలు ప్రకటించుకున్నారు. అంతేకాదు ఈ ఘనత సాధించిన మొదటి దంపతులం కూడా తామేని చెప్పుకున్నారు. అప్పుడు ఈ వార్త సంచలనం సృష్టించిది. అయితే అదంతా ఉత్తిదేనని తేలిపోయింది. ఇతరుల ఫొటోలను మార్ఫింగ్ చేసి  శిఖరాన్ని ఎక్కినట్లు ప్రకటించుకున్నట్లు తేలింది.

దినేశ్‌ రాఠోడ్‌, టర్కేశ్వరి రాఠోడ్‌ అనే భార్యాభర్తలు పుణెలో పోలీసు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 2016 మేలో తాము ఎవరెస్టు ఎక్కినట్లు తెలుపుతూ… అందుకు సంబంధించిన ఫొటోలను వారు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే ఈ దంపతులు ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కలేదని పలువురి నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో పుణె పోలీసు శాఖ వారిపై 2016 నవంబరులో సస్పెన్షన్‌ విధించింది.

తాజాగా దినేశ్‌ దంపతులను విధుల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సహిబ్రాయో పాటిల్‌ తెలిపారు. ప్రత్యేక ప్యానెల్‌ ఏర్పాటు చేసి విచారణ జరిపించగా దినేశ్‌ దంపతులు మోసం చేసినట్లు తేలింది. దీంతో వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy