ఈ ఫొటో గుట్టు తెలిసింది.. అసలు కథ ఇదీ.!

varalakshmi-pooja-1నోట్ల కట్టలతో లక్ష్మీదేవికి పూజ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫొటో బెంగుళూరుకు చెందిన ఓ మంత్రిగారి ఇంట్లోదన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే చివరికి అది ఓ సంపన్నుడి ఇంట్లోదని తేలింది. కళ్లు చెదిరే నగలు… డబ్బుతో అమ్మవారికి పూజ చేసిన ఆ పరమ భక్తుడు సురేశ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి. అంతేకాదు తను బెంగుళూరు అభివృద్ధి సంస్థలో బ్రోకర్ గా, పైరవీకారుగా పని చేస్తున్నాడు. నెట్ లో ఈ ఫొటోపై ప్రశ్నించగా అదంతా తనదేనని.. కష్టపడి సంపాదించుకున్నదని తెలపాడు. ఇన్ కమ్ ట్యాక్స్ వాళ్లు అడిగినా ఏం భయంలేదని.. అన్నింటికీ సమాధానం తమ దగ్గరుందని అంటున్నాడు సురేశ్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy