ఈ ఫోన్ కొంటే.. ఎయిర్‌టెల్ ఏడాది ఫ్రీ

micro-max-siteనోకియా నుంచి ప్రేర‌ణ పొందిందో ఏమో తెలియ‌దుగానీ… దేశీ మొబైల్ సంస్థ మైక్రోమ్యాక్స్ త‌న పాత వెర్ష‌న్ కాన్వాస్‌ను స‌రికొత్త‌గా కాన్వాస్‌-2 పేరుతో మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నుంది. మైక్రోమ్యాక్స్ కాన్వాస్‌-2 పేరుతో ఈ ఫోన్ రిలీజ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎయిర్‌టెల్ భాగ‌స్వామ్యంతో రానుంది. మైక్రోమ్యాక్స్ కాన్వాస్-2 మొబైల్ కొన్న‌వారికి ఆఫ‌ర్ కింద ఒక ఏడాదిపాటు ఉచితంగా 4జీ డేటా అందివ్వడంతో పాటు ఏ మొబైల్ నెట్‌వ‌ర్కుకైనా అప‌రిమిత కాల్స్ చేసుకోవ‌చ్చ‌ని మైక్రోమ్యాక్స్ స్ప‌ష్టం చేసింది. ఎయిర్‌టెల్ 4జీ సిమ్‌తో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్ కూడా ఉంటుంది. దీనికోసం కార్నింగ్ సంస్థ‌తో భాగస్వామ్య‌మైన‌ట్లు మైక్రోమ్యాక్స్ సంస్థ యాజ‌మాన్యం వెల్ల‌డించింది. మే 17నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానున్న మైక్రోమ్యాక్స్ కాన్వాస్‌-2 ధ‌ర రూ.11,999.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్‌-2 స్పెసిఫికేష‌న్స్‌
డిస్‌ప్లే: 5 ఇంచెస్‌
ప్రాసెస‌ర్ : 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్‌కోర్
ఫ్రంట్ కెమెరా : 5 మెగాపిక్సెల్‌
రియ‌ర్ కెమెరా : 13 మెగా పిక్సెల్‌
రిజ‌ల్యూష‌న్ : 720*1280 పిక్సెల్స్‌
ర్యామ్ : 3జీబీ
ఓఎస్ : ఆండ్రాయిడ్ 7.0
స్టోరేజ్ : 16 జీబీ
బ్యాట‌రీ కెపాసిటీ : 3050 ఎమ్ఏహెచ్‌

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy