ఈ బండ్లకే అరకోటి చలాన్లు : రూల్స్ బ్రేక్ లో టాప్ టెన్ ఇవే

challan-hyderabadఅదో డీసీఎం..  ఆ వెహికల్  రేటు అటు  ఇటుగా  9 లక్షలు. కానీ  గత మూడేళ్లలో  ఆ బండి ట్రాఫిక్  జరిమానాలు ఎంతో తెలుసా?  అక్షరాల  7లక్షల64వేల  220 రూపాయలు. అదో ఆటో.. ఖరీదు  రూ.4 లక్షల దాకా  ఉంటుంది.. కానీ దాని  ట్రాఫిక్  జరిమానాలు ఎంతో తెలుసా…5లక్షల 73  వేల రూపాయలు. అంటే  ఆటో రేటు  కంటే ఎక్కువే.  ఈ టాప్  టెన్  వాహనాలు  గత మూడేళ్లల  59లక్షల  80వేల  ఫైన్  కట్టినట్టు  లెక్క తేలింది.

.. ఇక హెల్మెట్  లేనందుకు  ఓ బైకర్ కు  97 చలాన్లు  జారీ అయ్యాయి. ఇలా టాప్  10 టూ వీలర్స్ కు ఏకంగా 650 చలాన్లు ముట్టినట్టు రికార్డులు చెప్తున్నాయి.

.. హైదరాబాద్  ట్రాఫిక్  పోలీసులకు అత్యధిక మొత్తం జరిమానాగా కడ్తుతున్న టాప్  టెన్  వాహనాలన్నీ కమర్షియల్, సరుకు రవాణా కేటగిరీకి చెందినవే. పౌరసరఫరాలు, అత్యవసర సేవలకు సంబంధించిన రవాణా వాహనాలకు మాత్రమే సిటీల 24 గంటలూ తిరిగేందుకు పర్మిషన్ ఉంది. ఇవన్నీ దుకాణాలు తెరిచి ఉంచే టైంలో తిరగాల్సి ఉండటంతో రోడ్లెక్కడం తప్పడం లేదు. దీంతోటి ట్రాఫిక్  రద్దీ తక్కువగా ఉండే ‘నాన్  పీక్  అవర్స్’లో పోలీసులు అనుమతి ఇచ్చారు.

.. రూల్స్ లెక్క  జరిమానా విధించిన తర్వాత ..మళ్లీ 24 గంటల దాటే వరకు మరోసారి ఫైన్  విధించేందుకు అవకాశం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అనేక వాణిజ్య, సరుకు రవాణా వాహనాలు నగర రోడ్లపై తిరుగుతున్నాయి. రోడ్లపైకి వచ్చిన వెంటనే ఏదో ఓ చోట ట్రాఫిక్  పోలీసులు విధించిన జరిమానా చెల్లించేసి …ఇక ఆ రశీదుతో రోజంతా నడుపుతున్నారు. తమ వ్యాపారంలో వచ్చే లాభం కంటే చెల్లించే జరిమానా అతి తక్కువ కావడంతో వాహనదారులు ఇలా చేస్తున్నారు.

.. టూ వీలర్స్ కూడా తక్కువేమీ కాదు .  కచ్చితంగా హెల్మెట్  ధరించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు చానా మంది. ఫైన్  విధించినా మళ్లీ అదే కారణంతో దొరికిపోతున్నారు. ఇలా గత మూడేళ్ల లెక్క తీస్తే అందులో తొలి పది మంది వాహనదారులకు ఏకంగా 650 ‘హెల్మెట్ ’జరిమానాలు పడ్డట్టు తేలింది.

.. ట్రాఫిక్  అధికారులు ఈ నెల 1 నుంచి ప్రవేశపెట్టిన పెనాల్టీ పాయింట్స్  విధానంతోటి…. ఇలాంటివాటికి బ్రేక్ పడుతుందని చెబుతున్నారు అధికారులు.  ఇప్పటివరకు చలాన్ కు సంబంధించిన నగదు చెల్లిస్తే సరిపోయేది. కానీ కొత్త విధానంలో రెండేళ్లలో కాలంలో 12 పాయింట్లు పడితే సదరు వాహనదారుడి లైసెన్స్  రద్దు కానుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy