ఈ బామ్మ బాధ ఎవరికీ ప‌ట్ట‌దా..?

sub wayమాన‌వ‌త్వం మంట‌గ‌లిసింది. అస్స‌లు వీరు మ‌నుషులేనా అనిపించింది. ఇక విష‌యానికొస్తే న్యూయార్క్ స‌బ్‌వే స్టేష‌న్‌లో ఓ రైలు ఆగిఉంది. రైలు దిగేందుకు ఓ బామ్మ డోరు వద్దకు చేరుకుంది. అదే సమయంలో  డోర్లు మూసుకున్నాయి. సాధారణంగా సెన్సార్లతో పనిచేసే డోర్లు, ఒక మనిషి ఆడోర్ల దగ్గరకు వస్తే తిరిగి ఓపెన్ అవుతాయి. కానీ బామ్మ అక్కడికి వచ్చేసరికి సెన్సార్లు ఫైయిలయ్యాయో ఏమో తెలియదుగానీ..ఆ డోర్ల మ‌ధ్య ఆ బామ్మ త‌ల ఇరుక్కొంది.  ఆమె హ్యాండ్ బ్యాగ్ ఆ డోరు బ‌య‌టకు వేలాడుతోంది. ప్లాట్ ఫాంపై చాలామంది వెళుతున్నా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. చివ‌ర‌కు అక్క‌డి నుంచే న‌డుచుకుంటూ వెళుతున్న రైల్వే ఉద్యోగులు కూడా ఆమెను విస్మ‌రించారు. ఆ బామ్మ త‌ల ఇరుక్క‌ని చాలా సేపు ఇబ్బంది ప‌డింది. ఈ దృశ్యాన్ని ప్లాట్‌ఫాంకు మ‌రోవైపున నిలిచి ఉన్న రైల్లో నుంచి ఓ ప్ర‌యాణికుడు రికార్డ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో  వైర‌ల్ అయ్యింది.  ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో వీక్షించిన నెటిజ‌న్లు మాన‌వ‌త్వం చ‌నిపోయిందంటూ కామెంట్ చేశారు. మ‌రికొంత మంది ఈ దృశ్యాన్ని రికార్డ్ చేసే బ‌దులు నువ్వే వెళ్లి ఆ వృద్ధురాలిని కాపాడి ఉండొచ్చు క‌దా అని పోస్ట్ చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy