ఈ రూ.5,400 కోట్లు అలా వచ్చినవే..

BLACK MONEYనోట్ల రద్దుతో భారీగా లెక్కలు చూపని ఆదాయం బయటపడింది. ఈ మొత్తం సుమారు రూ.5వేల కోట్లకు పైనే ఉందని తెలిపింది ఆర్థిక శాఖ. శనివారం(జూలై 22) పార్లమెంట్ కు సమర్పించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌.  నవంబర్‌ 8 నాటి నుంచి దేశవ్యాప్తంగా చేపట్టిన వేల సోదాల్లో మొత్తం రూ. 5400 కోట్లకు పైగా అప్రకటిత ఆదాయాన్ని ఐటీశాఖ వెలికితీసిందని ఆర్థికశాఖ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం నవంబర్‌ 9,2016 నుంచి జనవరి 10, 2017 వరకు 11 వందలకు పైగా ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. బ్యాంకు ఖాతాల్లో అధిక మొత్తంలో డబ్బు జమచేసిన వారిలో అనుమానాస్పదంగా ఉన్న ఖాతాలపై 5వేలకు పైగా నోటీసులు జారీ చేసింది. ఈ సోదాల్లో రూ. 610కోట్లకు పైగా విలువైన వస్తువులు, రూ. 513కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అంతేగాక, రూ. 110కోట్ల కొత్త కరెన్సీ నోట్లను కూడా జప్తు చేశారు. ఇక గతేడాది నవంబర్‌ 9 నుంచి ఈ ఏడాది జులై 14 వరకు రూ. 11.24కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించినట్లు తెలిపారు.

ఇక ఆపరేషన్‌ క్లీన్‌ మనీలో భాగంగా ఇటీవలే 5.56 లక్షల బ్యాంకు ఖాతాదారులతో రెండో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఖాతాల్లో అధికమొత్తంలో డబ్బు జమచేయడం, పన్ను వివరాలు తదితర విషయాలపై వీరిని ఐటీశాఖ వివరణ కోరింది. తొలి జాబితాలో 17.92లక్షల ఖాతాదారుల జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో 1.04లక్షల మంది సంబంధిత వివరాలు ఇవ్వలేదని ఐటీశాఖ తెలిపింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy