ఈ రోజు దొరికిన మూడు మృతదేహాలు..!

biyaas death 19-6-14హిమాచల్ ప్రదేశ్ బ్యాస్ నదిలో గల్లంతైన స్టూడెంట్స్ మృతదేహాలు ఒక్కొక్కటిగా దొరుకుతున్నాయి.  బుధవారం రెండు మృతదేహాలు దొరకగా అందులో ఒకటి తరుణ్ ది కాగా, మరొకటి స్థానికునిదిగా గుర్తించారు. ఇక గురువారం మరో మూడు మృతదేహాలను వెలికి తీసింది రెస్క్యూ టీమ్. ఇవాళ ఉదయం శివప్రసాద్ డెడ్ బాడీని వెలికితీశారు. తర్వాత మధ్యాహ్నం మరో రెండు వెలికి తీశారు. మధ్యాహ్నం సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన ఆశిష్ ముంతా, దిల్ సుఖ్ నగర్ కు చెందిన మాచర్ల అఖిల్ ల మృతదేహాలు వెలికి తీశారు. ఇన్సిడెంట్ జరిగిన టైంలో.. ఇద్దరు స్టూడెంట్స్ ను కాపాడి ఆశీష్ నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇవాళ దొరికిన మూడు ముగ్గురితో కలిసి మొత్తం 12 మంది స్టూడెంట్స్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 12 మంది డెడ్ బాడీస్ దొరకాల్సి ఉంది. మిగతా వారి కోసం కూడా గాలింపు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లోని వీఎన్ఆర్ కాలేజ్ కు చెంది. 24 మంది స్టూడెంట్స్ స్టడీ టూర్ కు వెళ్లి బ్యాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy