ఈరోజు నుంచే ఐ ఫోన్-6 అడ్వాన్స్ బుకింగ్

ఐ ఫోన్-6 ఫోన్ల ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ రోజు నుంచి మొదలవుతాయి. అమెరికా కంపెనీ యాపిల్…ఐ ఫోన్-6ను వాల్డ్ వైడ్ గా రిలీజ్ చేసినా..ఇండియాలో మాత్రం ఇప్పటి వరకూ రిలీజ్ చేయలేదు. ఈ నెల 17 నుంచి ఐ ఫోన్-6 ఫోన్లు అందుబాటులోకి తెస్తామని యాపిల్ కంపెనీ ప్రకటించింది. ఐ ఫోన్-6 ను రూ.53,500 లకే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఐ ఫోన్-6 అడ్వాన్స్ బుకింగ్స్ కోసం కస్టమర్లు చాలా ఇంట్రస్ట్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఐ ఫోన్-6లో హై ఎండ్ మోడల్ ఫోన్ ను రూ.80,500లకు అందించనున్నారు. ఐ ఫోన్-6ను మొత్తం మూడు వెర్షెన్లలో తయారు చేశారు. 16 జీబీ, 64 జీబీ, 128 జీబీ వెర్షెన్లతో అందుబాటులోకి తెచ్చారు. ఐ ఫోన్ డిస్ట్రిబ్యూషన్ పార్టనర్స్ అయిన ఇన్ గ్రామ్ మైక్రో, రెడింగ్టన్ సైట్ లలో ఐ ఫోన్ ను అమ్మనున్నారు. అమెరికాతో పొల్చుకుంటే ఇండియాలో ఐ ఫోన్ ను 10 నుంచి 17 శాతం ఎక్కువ రేట్లకు అమ్మనున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy