బక్రీద్ సందడి….

bakridరాష్ట్రంలో బక్రీద్ సందడి కనిపిస్తోంది. బక్రీద్ పండగ  వస్తోందంటేనే, అందరికీ  ఖుర్బానీ గుర్తుకు వస్తుంది.  హజరత్  ఇబ్రహీం త్యాగం కళ్లముందు కదలాడుతుంది.  బక్రీద్ కు  ఖుర్బానీ కి  సంబంధం ఏంటి…..?  హజరత్ ఇబ్రహీం  చేసిన త్యాగం ఏంటి….?  అసలు బక్రీద్  పరమార్థం ఏంటి…..? అని తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే….

బక్రీద్  అంటేనే…..త్యాగాన్ని గుర్తు చేసుకోవడం.  బక్రీద్ కు మరో పేరే …..ఈదుల్ జుహా.  బకర్ అంటే…. గొర్రె అని అర్థం. ఖుర్బానీ అంటే త్యాగం. బక్రీద్ అనగానే ….అందరికీ పొట్టేళ్లను ఖుర్బానీ ఇవ్వడం గుర్తుకు వస్తుంది. పొట్టేళ్ల ఖుర్బానీ వెనక ఓ ఇంటరెస్టింగ్ స్టోరీ ఉంది . అయిదే వేల ఏళ్ల కిందట…..హజ్ రత్ ఇబ్రహీంకు కలలో దేవుడు  కనిపించి….ఆయన కుమారుడు ఇస్మాయిల్ ను తన పేరున బలి ఇవ్వమని  కోరతాడు. దేవుడి  ఆనతి ప్రకారం……కుమారుడు  ఇస్మాయిల్ ను బలి ఇవ్వడానికి  రెడీ అవుతాడు హజ్ రత్ ఇబ్రహీం. అయితే, బలి ఇవ్వడానికి  ఇబ్రహీం  సిద్ధపడినా,  కత్తి  తెగదు. దేవుడి ఆనతి లేనిదే, తాను తెగనంటుంది ఇస్మాయిల్ మెడపై వేలాడే కత్తి. దీంతో,  ఇస్మాయిల్ స్థానంలో ఒక పొట్టేలును బలి ఇచ్చి అల్లా ఆదేశాలను అమలు చేస్తాడు ఇబ్రహీం. ఇదే మెల్లమెల్లగా  ఖుర్బానీగా మారింది. అప్పటి నుంచీ… బక్రీద్  కు పొట్టేలును బలి ఇవ్వడం ఒక ఆచారంగా మారింది. హజ్ రత్  ఇబ్రహీం త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ అప్పటినుంచీ బక్రీద్ పండగ చేసుకోవడం మొదలెట్టారు ముస్లింలు. బక్రీద్ నెలలోనే….హజ్ యాత్ర కు బయల్దేరతారు. బక్రీద్ పండగరోజున మక్కాలో నమాజ్ చేయడాన్ని ఎంతో  పవిత్రంగా భావిస్తారు ముస్లింలు. రకరకాల కారణాలతో హజ్ కు వెళ్లలేని డబ్బున్న ముస్లింలు….బక్రీద్ రోజున తప్పనిసరిగా ఖుర్బానీ ఇవ్వాలి. ఖుర్బానీ అంటే….మాంసం పంచడం. అయితే, ఖుర్బానీ  ఇవ్వడం కోసం అప్పులు చేయడం నిషేధం. అప్పు చేయకుండా, సరిపడా డబ్బు ఉన్న వాళ్లే ఖుర్బానీ ఇవ్వాలంటుంది ఇస్లాం. ఖుర్బానీ  ఇచ్చే మాంసాన్ని  మొత్తం మూడు భాగాలు చేస్తారు. మొదటి భాగం….పూర్తిగా కుటుంబం కోసం. రెండో భాగం…..బంధుమిత్రుల కోసం. ఇక మిగిలిన మూడో భాగాన్ని  పేదలకు పంచుతారు. బక్రీద్ కు ముస్లింలందరూ  ఈద్గాలో సమావేశమవుతారు. అందరూ కలిసి, నమాజ్ చేస్తారు. తరువాత ఒకరికొకరు ‘ఈద్ ముబారక్’ అంటూ  శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆ తరువాత, ఖుర్బానీ మాంసంతో భోజనం చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy