ఈ శతాబ్దం ఆసియాదే: మోడీ

1795615_686367248160649_2139429936483301022_nమంగోలియాలో ప్రధాని మోడీ టూర్ ముగిసింది. రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించిన నమో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 6 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు ప్రధాని. భారత్, మంగోలియాది ఆధ్యాత్మిక బంధమని ట్విట్టర్లో అభివర్ణించారు మోడీ. మంగోలియా దేశాధినేతలు, అధికారులు మోడీకి గ్రాండ్ గా సెండాఫ్ చెప్పారు. ఆ దేశ సాంప్రదాయాలతో కళాకారులు ఎయిర్ పోర్ట్ లో నమోకు వీడ్కోలు పలికారు.

రెండు రోజుల పర్యటన కోసం ఆయన మంగోలియా నుంచి నేరుగా కొరియా చేరుకున్నారు. సోయల్ ఎయిర్ పోర్ట్ లో ఆ దేశ ప్రతినిధులు మోడీకి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత అమర జవాన్లకు ప్రధాని మోడీ ఘన నివాళులు అర్పించారు. ఇవాళ,  రేపు ఆయన కొరియాలోనే ఉండనున్నారు. మోడీని కలుసుకునేందుకు ప్రవాస భారతీయులు ఎయిర్ పోర్టుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి దగ్గరకు వెళ్లి స్వయంగా పలకరించారు నమో. షేక్ హ్యాండ్,  ఆటో గ్రాఫ్ ఇచ్చి వారితో ముచ్చటించారు.

ఆ తర్వాత సియోల్ సైనికుల గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని మోడీ. అక్కడే అమర జవాన్ల స్థూపానికి నివాళులు అర్పించి విజిటర్స్ బుక్ లో తన సందేశం రాశారు. ప్రపంచంలో వేగంగా డెవపల్ అవుతున్న దేశం భారత్ అని చెప్పారు ప్రధాని. సియోల్ టూర్ లో ఇండియన్స్ ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత్ పై ప్రపంచ దేశాల వైఖరి మారిందన్నారాయన. అటు ఇండియా లేకుండా బ్రిక్స్ కూటమి అసంపూర్తిగా ఉంటుందన్నారు. ఈ శతాబ్దం ఆసియాదే అన్నారు నమో. కొరియా టూర్ లో భాగంగా ఆర్థిక,  వాణిజ్య సహకారంపై డిస్కస్ చేయనున్నారు. సౌత్ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్ హితో ఆయన మీటవనున్నారు. సియోల్లో కళాకారుల ఆటపాట అందరినీ ఆకట్టుకున్నాయి.

1470115_686367244827316_8691642175820067746_n

10383481_686367198160654_8765927611145381804_n

10403269_686367238160650_5235530210646459717_n

10885438_686367311493976_7452428024687039259_n

11147578_686367201493987_8893304384569203754_n

11265539_686367208160653_813724419024135569_n

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy